NTV Telugu Site icon

టీ దుకాణంలో గొడవ.. ముగ్గురికి కత్తిపోట్లు

జగిత్యాల పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీన్‌ఖని చౌరస్తా వద్ద ఓ టీ దుకాణంలో ఒక వర్గానికి చెందిన వారు… మరోవర్గంపై దాడికి పాల్పడ్డారు. ఓ విషయంలో ఇరు వర్గాలకు చెందిన వారు ఘర్షణకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వ్యక్తులను వెంటనే సమీపంలోని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read Also: ఓ ప్రియుడి ఆవేదన.. ఐయామ్ వెరీ సారీ అంటూ…

కాగా గాయపడిన వారు జగిత్యాల పురాణిపేటకు చెందిన మణి, నాగరాజు, ప్రభుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఘర్షణకు తలెత్తిన అంశాలపై వారు దర్యాప్తు చేపట్టారు. మళ్లీ గొడవలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.