హుజురాబాద్ ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ రోజు ప్రచారంలో భాగంగా బీజేపీ,టీఆర్ఎస్ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు. జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారానికి ఇంకా కొన్ని రోజులే ఉండటంతో ఆయా పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఒకరినొకరు మాటలతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాటే పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ రెండు పార్టీలు దొంగలేనని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
