Cyber fraud: రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఒక దానిపై ప్రజలు తెలుసుకునే లోపే మరొక సైబర్ నేరానికి తెర లేపుతున్నారు. ఈకాలంలో ఆన్‌లైన్ పేమెంట్లు, షాపింగ్ పెరిగుతుండటంతో.. మోసాలు కూడా అదే రేంజ్‌లో పెరుగుతున్నాయి. దీంతో..ఇక సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. ఎక్కడా లేని విధంగా.. ఎవరూ ఊహించని రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక జనాలను మోసం చేయడానికి సైబర్ మోసగాళ్లు ఎలాంటి మార్గం వదలిపెట్టడం లేదు. అయితే దీనిపై పోలీసులు సైబర్ నేరాల గురించి ఎంత అవగాహన కల్పించినా సరే.. ఏదో రకమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఒకరకమైన నేరాల గురించి అవగాహన కల్పించేలోపే మరో రకమైన మోసాలకు వెలుగులోకి వస్తున్నారు. కాగా.. నిన్నటి వరకు ఓటీపీ స్కామ్ గురించి తెలుసుకున్నాం. కొద్దిరోజుల క్రితం డెలివరీ బాయ్ రూపంలో కేటుగాళ్లు ఎలా మోసాలకు పాల్పడుతున్నారో చూశాం. ఇక తాజాగా మరో రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కరెంట్ బిల్లు పేరు చెప్పి అకౌంట్ ఖాళీ చేశారు సైబర్ కేటుగాళ్లు. ఈఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: High Court: కుక్కల దాడిలో బాలుడు మృతి.. నేడు హైకోర్టు విచారణ
కామారెడ్డి జిల్లాలో దేవునిపల్లి కి చెందిన రాజేశ్వర్ కు సైబర్ కేటుగాళ్ల ఫోన్ చేశాడు. కాల్ లిప్ట్ చేసిన రాజేశ్వర్ కు 3 మూడు నెలల నుంచి కరెంటు బిల్లు పెండింగ్ ఉందంటూ బాధితునికి ఫోన్ లో మాట్లాడాడు. విద్యుత్ కనెక్షన్ బిల్లు సవరణ కాలేదని సైబర్ కేటుగాళ్లు రాజేశ్వర్ కు బెదిరించాడు. మీకు ఒక లింక్ పంపిస్తాము దాన్ని క్లిక్ చేయాలని సూచించారు. బాధితుడు నిజంగానే కరెంట్ బిల్లు కట్టలేదా? ఇంకా ప్రశ్నించికుంటున్న సమయంలోనే బాధితుడు రాజేశ్వర్‌కు కేటుగాళ్లు సెల్ ఫోన్ కు లింకు పంపించారు. దీంతో రాజేశ్వర్ ఆ లింక్ ను ఓపెన్ చేశాడు అంతే క్షణంలోనే రాజేశ్వర్ ఖాతాలో నుంచి రూ. 49 వేలు కట్ అయ్యాయి. కంగుతిన్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగదుపై ఫ్రీజింగ్ విధించినట్లు తెలిపారు. ఇది మరో తరహా కొత్తరకం మోసమని పేర్కొ్న్నారు. సాధారణంగా కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ సిబ్బంది ఫోన్ చేసి బిల్లు కట్టమని అడగరని స్పష్టం చేశారు. వారు డైరెక్ట్ గా ఇంటికే వచ్చి అడగడమో, లేదంటే స్థానిక లైన్‌మెన్ వచ్చి బిల్ల కట్టమని అడగడం చేస్తాడని తెలిపారు. అలా కాకుండా కరెంట్ బిల్లు కట్టమని ఒకవేశ ఎవరైనా ఫోన్ చేశారంటే అది ఖచ్చితంగా మోసగాళ్లే అయ్యి ఉంటారని తెలిపారు. ఈవిషయం తెలియకపోతే సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవడం పక్కా అంటున్న పోలీసులు.
Bike Racers: పాతబస్తీలో బైక్ రేసర్లు వీరంగం.. యువకుడిపై కత్తితో దాడి