NTV Telugu Site icon

BRS Leaders Team: నేడు కరీంనగర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. గోదావరిఖనిలో బస..

Kaleshwaram

Kaleshwaram

BRS Leaders Team: నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కరీంనగర్ కు వెళ్లనుంది. మధ్యాన్నం హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ బృందం బయలుదేరనుంది. సాయంత్రం లోయర్ మానేరు రిజర్వాయర్ సందర్శించనున్నారు. కరీంనగర్ లో డిన్నర్ తర్వాత గోదావరిఖని ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. గోదావరిఖనిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస చేయనున్నారు. గోదావరిఖని ఎన్టీపీసీ, సింగరేణి గెస్ట్ హౌస్ లలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస చేయనున్నారు. రేపు మేడి గడ్డను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. మొదటగా కన్నెపల్లి పంప్ హౌస్ ని విజిట్ చేసి మీడియాతో మాట్లాడి మెడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు పయనం కానున్నారు. కాళేశ్వరం పర్యటన అనంతరం వీరంతా తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. మేడిగడ్డ వరదల నుంచి బయటపడిందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక బీఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.

Read also: Hyderabad Crime: తల్లి బలవన్మరణం.. షాక్ గురైన కొడుకు కూడా..

మరోవైపు కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకలో కూరుకుపోయిందన్న ప్రచారాలను మానుకోవాలన్నారు. ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నా కాళేశ్వరం పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించబోతున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి కోట్లాది క్యూసెక్కుల నీరు వచ్చి మేడిగడ్డ నిలుస్తోందన్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో టీమ్‌ పర్యటనకు వెళ్లడంతో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఈ సాయంత్రం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌కు బీఆర్‌ఎస్ నేతలు చేరుకోనున్నారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం బీఆర్‌ఎస్ బృందం రాత్రి రామగుండంలో బస చేయనుంది. రేపు 10 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్‌, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్‌కు తిరిగి రానుంది.
Joe Biden: వయస్సు, అనారోగ్యం కాదు.. తన అభ్యర్థిత్వాన్ని ఎందుకు వదులుకున్నాడో చెప్పిన బైడెన్

Show comments