NTV Telugu Site icon

Bandi Sanjay: శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం పాటుపడదాం..

Bandi Snajay

Bandi Snajay

Bandi Sanjay: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈరోజు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం ఆవరణలో బండి సంజయ్ కుమార్ పార్టీ నేతలు, భక్తులతో కలిసి శమీ పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాతూ.. హిందూ బంధువులందరికీ పవిత్రమైన శక్తివంతమైన విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికీ విజయాలు అందించాలి. స్వార్ధం, కల్మషం వీడి శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దాం. కష్టసుఖాలను పంచుకుందాం అన్నారు.

గతంలో జరిగిన మంచి చెడులను బేరీజు వేసుకుని మంచి జరిగేలా అమ్మవారిని వేడుకుందాం. గతంలో పడిన కష్టాలు, ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. అందరిలో మంచి ఆలోచనలు కలిగాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం చేస్తున్న కార్యక్రమాల్లో ఎలాంటి అవరోధం లేకుండా విజయం చేకూర్చాలి. భారతమాతను విశ్వగురు స్థానంలో ఉంచేందుకు మోదీ చేస్తున్న క్రుషి సాకారమయ్యేలా అమ్మవారి ఆశీస్సులందించాలి. అట్లాగే కరీంనగర్ పార్లమెంట్ తోపాటు తెలంగాణ అభివ్రుద్ధి చెందేలా అందరం కలిసి భాగస్వాములు కావాలని అమ్మవారిని వేడుకున్నా అన్నారు.
Dasara Effect Liquor Sales: తెగ తాగేశారు.. 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యం..

Show comments