Kaushik Reddy: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని.. అయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు. జిల్లా కలక్టరేట్ లో అధికారిక సమావేశంలో గందరగోళం సృష్టించి, మీటింగ్ ని పక్కదారి పట్టించారని కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసును నమోదు చేశారు.
Read Also: Khammam: నేడు ఖమ్మం జిల్లాలో ఐదుగురు మంత్రుల పర్యటన..
ఇక, తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, బూతులు తిడుతూ దాడికి యత్నించారని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై సైతం పోలీసులు ఇంకో కేసు నమోదు చేశారు. వేరు వేరుగా మూడు కేసులను పోలీసులు నమోదు చేసుకున్నారు. అయితే, ఆదివారం నాడు కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరడంతో ఇరువురు పరస్పరం తోసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరోకరు తోసుకోవడంతో సమావేశం గందరగోళంగా మారింది.