NTV Telugu Site icon

Drivers Protest: మోగిన సమ్మె సైరన్.. వేతనాలు పెంచాలని బస్సు డ్రైవర్లు ఆందోళన

Drivers Protest

Drivers Protest

Drivers Protest: కరీంనగర్‌ లో ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మె సైరన్‌ మోగింది. బస్సు డ్రైవర్ల సమ్మె కారణంగా ఇవాళ తెల్లవారుజాము నుంచే ఇతర ప్రాంతాలతో పాటు గ్రామాలకు వెళ్లే అద్దె బస్సులు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి కరీంనగర్ కు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు కూడా సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేకపోతున్నారు. నామమాత్రపు వేతనాలతో పాటు వేధింపులు కూడా తీవ్రంగా మారాయని బస్సు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ అధికారుల వివక్ష, వేధింపులను ఆపాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. నేడు ఉదయం కరీంనగర్‌ ఆర్టీసీ డిపో ఎదుట బస్సు డ్రైవర్లు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడంతో బస్‌ స్టేషన్‌ పరిసరాలు దద్దరిల్లాయి.

Read also: Afghanistan: బొమ్మైనా సరే ముఖానికి ముసుగు ఉండాలి.. మహిళలపై తాలిబన్లు ఆంక్షలు

బస్సు డ్రైవర్ల నిరసనకు సిఐటియు కూడా మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. దాదాపు నెల రోజుల క్రితం ఇదే తరహాలో సమ్మె చేయడంతో అధికారులు అద్దె బస్సుల యాజమాన్యంతో చర్చలు జరిపి ఆందోళనలు విరమించారు. ఇవాళ మళ్లీ అదే డిమాండ్లతో అద్దె బస్సుల డ్రైవర్లు నిరసనకు దిగారు. సమ్మె కారణంగా అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీసీ డిపోలపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు.
Tension in Laktikapool: టీచర్ల మౌన దీక్ష.. పిల్లలతో సహా అరెస్ట్