కరీంనగర్ పెద్దాసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చండి. జిల్లా ఆసుపత్రికి ఎమ్మారై, హుజూరాబాద్ కు సీటీ స్కాన్ ను ఇవ్వండి అని కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ కు ఎంపీ బండి సంజయ్ విన్నవించారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, పేద రోగుల ప్రయోజనార్ కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి ఎంఆర్ఐ స్కాన్, హుజూరాబాద్ ఆసుపత్రికి సీటీ స్కాన్ ను తక్షణమే మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గురువారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయను కోరారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కలిసిన బండి సంజయ్ వందలాది గ్రామాల చుట్టూ ఉన్న ప్రధాన వ్యాపార కేంద్రమైన కరీంనగర్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవల అవసరాలు పెరుగుతున్న విషయాన్ని ఆయన ద్రుష్టికి తీసుకొచ్చారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు స్పూర్తితో తన 50వ జన్మదినోత్సవం నాడు కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఆసుపత్రులకు నాలుగు అంబులెన్సులు, వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చిన విషయాన్న గుర్తు చేశారు. జిల్లా ప్రజల విస్త్ర ప్రయోజనాల దృష్ట్యా కరీంనగర్‌లో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలన బండి సంజయ్ కేంద్ర మంత్రిని కోరారు.
