Site icon NTV Telugu

Viral News : వాట్సాప్ గ్రూపుల్లో కానిస్టేబుల్ సందేశం కలకలం

Whats App Audio

Whats App Audio

రాష్ట్రంలోని పోలీసు స్పౌస్ ట్రాన్స్ఫర్ విషయంలో ఓ కానిస్టేబుల్ మన స్తాపం చెంది ఆడియోలో చెప్పిన ఆవేదన పలు వాట్సాప్ గ్రూపుల్లో తిరగడం కలకలం రేపింది. సదరు కానిస్టేబుల్ ‘ప్రభుత్వం ఇచ్చిన 317 జీవో నిబంధనలతో భార్యాభర్తలు విడిపోయామని.. చెరోచోటా దూరంగా ఉన్నామని.. మాకు చిన్నపిల్లలున్నారని.. మనోవేదనకు గురవుతున్నామని.. తనలాగే చాలా మంది కానిస్టేబుల్లు బాధపడుతున్నారని.. 11వ తేదీ వరకు స్పౌస్ ట్రాన్స్ఫర్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేడుకుంటున్నామని.. ఇప్పటికే నెలల తరబడి ఇబ్బంది పడుతున్నామని.. 11వ తేదీ వరకు ట్రాన్స్ఫర్ చేయకపోతే 12వ తేదీన ఆత్మ హత్య చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు. ఈ వాయిస్ మెస్సేజ్ గ్రూపుల్లో వైరల్ అయింది. దీంతో పోలీసుశాఖలో పెద్ద చర్చ మొదలైంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 317 జీవో కారణంగా ఎంతో మంది భార్యభర్తలు మానసిక క్షోభకు గురవుతున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరికొంతమంది జీవితాల్లో 317 జీవో విషాదంతం కూడా నింపిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ వాట్సాప్‌ మేసేజ్‌ ఎక్కడిదని తెలుసుకునే పనిలో పోలీస్‌ శాఖ ఉంది.

Exit mobile version