Telangana BJP: తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా క్రమంగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సొంత పార్టీ నేతలే అధ్యక్షుడిపై వ్యతిరేకంగా గళం విప్పారు. ఇన్నాళ్లూ ఏకంగా కనిపించిన కమలం పార్టీ వ్యతిరేకతలు బట్టబయలైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, టీపీసీసీతో సంబంధం లేకుండా తామే అధ్యక్షుడిగా భావించడం వంటి పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన నష్టం వాటిల్లుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బీజేపీలోనే వ్యతిరేక గళం వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎమ్మెల్సీ కవితపై చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీ వర్గాల్లోనే బండి సంజయ్ వ్యాఖ్యలు సరికావంటూ తప్పుబట్టడంతో రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. కవితపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదంటూ నిన్న సీనియర్ నేత పేరాల శేఖర్ రావు అనగా.. మొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నమాట తెలిసిందే.. అయితే.. నేడు కరీంనగర్ జిల్లా సీనియర్ నేత ధర్మపురి ఇంచార్జ్ కన్నం అంజయ్య కూడా బండిసంజయ్ వ్యాఖ్యలు తప్పుపట్టడంపై మరో తిరుగుబాటు బండి సంజయ్ పై మొదలైందని పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read also: Kangana Ranaut: దేశ కీర్తి ప్రతిష్ఠలను భుజాలపై మోసింది.. దీపికపై కంగన ప్రశంసల వర్షం
ధర్మపురి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ కన్నం అంజయ్య మాట్లాడుతూ.. ఒక రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ స్త్రీల పట్ల కవిత పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అమాటలను వెనక్కి తీసుకోవాలని ధర్మపురి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ కన్నం అంజయ్య డిమాండ్ చేశారు. బీజేపీలో దళితులు, గిరిజనులకు న్యాయం జరిగింది రాష్ట్రపతులను చేసింది బీజేపీ అన్నారు. అటువంటి బీజేపీలో బండి సంజయ్ నాయకత్వంలో న్యాయం జరగడంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ళ నుంచి అధ్యక్షునిగా ఉన్నారు.. ఆయన కార్యవర్గంలో దళితులకు న్యాయం జరగడంలేదని అన్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసాము.. కుటుంబాన్ని వదులుకున్నాం… మమ్మల్ని కాదని నిన్న మొన్న వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారు బండి సంజయ్ అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ చర్యలపై మేము అధిష్టానం కు ఫిర్యాదు చేశామన్నారు. బండి సంజయ్ కార్పొరేట్లకు, NRI లకు, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారు.. వారికి పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని పార్టీకోసం పనిచేసేవారిని కాదని కార్పొరేట్ వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. బండి సంజయ్ వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నారని మండిపడ్డారు. దళిత నాయకులను కావాలని అనగదొక్కుతున్నారని ఆరోపించారు.
Read also: MK Stalin: శ్రీలంక చెర నుంచి భారతీయ జాలర్లను విడిపించాలి.. ప్రధాని మోదీకి స్టాలిన్ లేఖ
పది రోజుల్లో బండి సంజయ్ బాధితులతో ఆత్మీయ సమ్మేళనం పెడత.. నీమీద ఎంత వ్యతిరేకత ఉందొ చూపిస్తా అంటూ సవాల్ విసిరారు. నీకు పదవులు రాకపోతే బీజేపీ రాష్ట్ర ఆఫీస్ తలుపులు పలగగొట్టినారని, నువ్ చూపెట్టిన బాటలోనే నేను నిరసన వ్యక్తం చేస్తున్న అన్నారు. దళిత కుబేరుడు వివేక్ బండి సంజయ్ ప్రోద్బలంతో ధర్మపురిలో నేను కట్టిన బీజేపీ గద్దెలపై జెండా ఎగరవేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ఎస్సి వర్గీకరణ పై మాట్లాడుతుంటే వర్గీకరణ వద్దని వివేక్ చెప్పారని అన్నారు. రిజర్వేషన్లు అనుభవించి కోట్లు సంపాదించుకున్న వివేక్ కుటుంబం రిజర్వేషన్లను వదిలేయాలన్నారు. బీజేపీలో ఎస్సీలు అంటే మాలలు మాత్రమే.. మాదిగలకు స్థానం లేదన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు అయ్యారు మాదిగలు.. బీజేపీలో ఒక్క దళితుడు, మాదిగ అయినా జిల్లా అధ్యక్షుడు అయ్యారా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత వెంకటస్వామి విగ్రహానికి ఓపెన్ చేయడానికి సంజయ్ వెళ్లారు… బీజేపీ జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ జయంతిని బండి సంజయ్ జరిపినావా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నేను ప్రశ్నించినందుకు నన్ను సస్పెండ్ చేస్తావా సంజయ్.. నువ్ సస్పెండ్ చేసినా పార్టీ మారేది లేదన్నారు. బండి సంజయ్ కోట్లాది రూపాయలు సంపాదించినవు… ఖబడ్దార్ బండి సంజయ్ అంటూ హెచ్చరించారు. ఎస్సి వర్గీకరణ చేసేందుకు ఎజెండా తీస్కుంటావా సంజయ్? అని ప్రశ్నించారు.
TSPSC Paper Leak: TSPSC పరీక్ష రద్దుపై ఉత్కంఠ.. మధ్యాహ్నం రానున్న క్లారిటీ