Site icon NTV Telugu

IIT Student Rahul Suicide incident: రాహుల్ ఆత్మహత్యకు కారణం అదేనా?

Iit Hyd Rahul

Iit Hyd Rahul

సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో బీటెక్ స్టూడెంట్ రాహుల్ అనుమానాస్పద మృతి సంచలనం రేపిన సంగతి తెలిసింది. రాహుల్ మృతిపై వివరాలు వెల్లడించారు సంగారెడ్డి ఎస్పీ..డిప్రెషన్ తోనే రాహుల్ చనిపోయాడని, చదువులో ఒత్తిడిని భరించలేక రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్పీ వివరించారు. రాహుల్ కి చెందిన ల్యాప్ టాప్ లో కీలక విషయాలు లభ్యం అయ్యాయి. ల్యాప్ ట్యాప్ ని పరిశీలించి చూస్తే రాహుల్ సూసైడ్ నోట్ అందులో లభించిందని తెలిపారు ఎస్పీ.

Read Also:IIT Student incident: డిప్రెషన్ లో వున్నాడు.. ఇంత పనిచేస్తాడనుకోలేదు

చదువు పూర్తయిన తర్వాత నాకు జాబ్ వస్తుందనే నమ్మకం లేదు..అందుకే నేను చనిపోతున్నా. అమ్మ, నాన్న, చెల్లి నన్ను క్షమించండి. నాన్న ఇంత చిన్న ఒత్తిడి నేను రించలేకపోతున్నాను. నువ్వు ఇన్ని రోజులు మమ్మల్ని పోషించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు. చెల్లి… అమ్మ నాన్నని బాగా చూసుకో.. నేను ఇక ఉండను
ఐఐటీ హైదరాబాద్ పై రాహుల్ సూసైడ్ నోట్ లో అనేక విషయాలు బయటపడ్డాయి.

ఐఐటీలో స్టై ఫండ్ నెల నెలా సరిగా ఇవ్వట్లేదని, అందుకు ఇబ్బందిగా ఉందన్నాడు. కోవిడ్ వల్ల ఆన్లైన్ చదువుతో నా ఆత్మస్తైర్యం దెబ్బతింది. ఈ పోటీ ప్రపంచంలో బతుకుదాం అన్న ఆశ లేదు. 2019లో జరిగిన ఘటనలకు సంబంధించి ఐఐటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు..5G టెక్నాలజీ రాకముందే చనిపోతున్నా అన్నాడు రాహుల్. ఆగస్టు నెల 31న IIT క్యాంపస్ లో అనుమానాస్పదంగా విద్యార్ధి రాహుల్ చనిపోయిన సంగతి తెలిసిందే. హాస్టల్ గదిలో మంచానికి ఉరివేసుకుని చనిపోయిన రాహుల్ సంగతి తోటి విద్యార్థులు పోలీసులకు తెలిపారు. రాహుల్ నంద్యాలకు చెందిన విద్యార్ధి. రాహుల్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించి …తల్లిదండ్రులకు అప్పగించారు. రాహుల్ మృతికి గల కారణాలు ఏంటో తెలీక తోటి విద్యార్ధులు ఆందోళనకు గురయిన సంగతి తెలిసిందే. రాహుల్ రాసిన సూసైడ్ నోట్ బయటకు రావడంతో అంతా అవాక్కయ్యారు.

Read Also: IIT Student Rahul Suicide incident: రాహుల్ ఆత్మహత్యకు కారణం అదేనా?

Exit mobile version