NTV Telugu Site icon

Damodara Raja Narasimha : దసరా నాటికి కంకోల్‌ పీహెచ్‌సీ ప్రారంభం

Damodara Rajanarasimha

Damodara Rajanarasimha

సంగారెడ్డి జిల్లాలోని కంకోల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ని దసరా నాటికి పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మునిపల్లి మండలం కంకోల్‌లో పిహెచ్‌సికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ.. 8నెలల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించి పిహెచ్‌సిని నిర్వహిస్తామన్నారు. అందోలు నియోజకవర్గం పరిధిలోని మునిపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పెద్ద చెల్మడ గ్రామంలో రూ.4.35 కోట్లతో నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. బాలికల వసతి గృహానికి రూ.60 లక్షలు మంజూరు చేయడమే కాకుండా మోడల్ స్కూల్ మునిపల్లిలో రూ.65 లక్షలతో పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

Balineni Srinivasa Reddy: నేను ఏదైనా చేయాలనుకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లి చేస్తా..

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. మారుమూల గ్రామాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది పని చేయాలని సూచించారు. పీహెచ్‌‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కావాల్సిన వసతులపై వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక పాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు 1800 వ్యాధుల చికిత్స కోసం రూ.487 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, డీఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Rats Nibble : ఐసీయూలో ఉన్న రోగిని కొరికిన ఎలుకలు

Show comments