NTV Telugu Site icon

Kamareddy School Bus: స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ.. బస్సులో 50 మంది స్టూడెంట్స్..

Kamareddy School Bus

Kamareddy School Bus

Kamareddy School Bus: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ కు చెందిన బస్సులో బ్యాటరీ ప్రమాదవశాత్తు పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో భయాందోళన చెందిన స్టూడెంట్స్‌ భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలు వేస్తూ భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కాసేపు ఏం జరుగుతుందో స్థానికులు అర్థం కాలేదు. ప్రమాదం సంబంధించినప్పుడు బస్సులో సుమారు 50 మంది స్టూడెంట్స్ ఉన్నట్లు సమాచారం.

Read also: MSME Policy: ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యాంశాలు ఇవే..

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ కు చెందిన బస్సు రోజూలాగానే విద్యార్థులను ఎక్కించుకుని బయలు దేరింది. బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు వున్నారు. అయితే ఒక్కసారిగా బస్సులు పొగలు వ్యాపించాయి.. అంతలోనే మంటలు చెలరేగాయి. విద్యార్థులు భయంతో అరుపులు కేకలు వేశారు. బస్సు డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపేశాడు. విద్యార్థులు భయంతో కిందికి పరుగులు పెట్టారు. బస్సులో వున్న బ్యాటరీ ప్రమాదవశాత్తు పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే బస్సుల డ్రైవర్‌ వెంటనే బస్సు ఆపడంతో ప్రమాదం తప్పింది.

ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సులో మంటలు వ్యాపించాయన్న సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందారు. వెంటనే స్కూల్‌ వద్దకు చేరుకుని స్కూల్‌ యాజమాన్యం, బస్సు డ్రైవర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా స్కూల్‌ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇందతా జరగిందని బస్సును పరిశీలించి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగేవి కావని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం బస్సులను పరిశీలించిన తరువాతే డ్రైవర్‌ పిల్లలను బస్సులో ఎక్కించాలని డిమాండ్‌ చేశారు.
Sangareddy: ఆకలి అంటే దొంగకు అన్నం పెట్టారు.. సంక్రాంతి సినిమాకు మించిన సీన్‌