NTV Telugu Site icon

Cyber ​​Hackers: లింకులు పెట్టి లక్షణాల్లో లక్షలు కాజేస్తున్న సైబర్ కేటుగాళ్లు

Cyber

Cyber

Cyber ​​Hackers: సైబర్ నేరగాళ్ల బెదిరింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకుంటున్నారు. మోసం చేయడంలో తప్పు లేదన్నట్లుగా సైబర్ నేరగాళ్లు వ్యవహరిస్తున్నారు. మనిషి ఆశను ఆసరాగా చేసుకుని దొంగతనాల కాడిని దోచుకుంటున్నారు. ఒక్క క్లిక్ తో వేల లక్షలు తీసుకుపోతున్నారు. మనం మోసపోయామని తెలియకముందే అంతా జరిగిపోతుంది. రోజుకు ఒక సైబర్ నేరం ఆందోళన కలిగిస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Read also: Tollywood: టాలీవుడ్‌ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత

కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన నిఖిల్ గౌడ్ అనే యువకునికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ లింకును పంపిన సైబర్ కేటుగాళ్లు. దీంతో లింకును బాధితుడు నిఖిల్ గౌడ్ ఓపెన్ చేశాడు. ఇదే సమయంగా భావించిన సైబర్ కేటుగాళ్లు అమౌంట్ పంపాలని సూచించారు. ఎందుకు చేయాలని దానికి లాభమేంటని అడిగాడు బాధితుడు దీంతో.. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. నిజంగానే లాభాలు వస్తాయని నమ్మిన బాధితుడు నిఖిల్‌.. విడతలవారీగా UPI అకౌంట్ ద్వారా 1,12,400 లక్ష పంపాడు. తరువాత అతనికి తిరిగి ఒక్క పైసా కూడా రాకపోవడమే సందేహం వచ్చింది. దీంతో వారి నెంబర్‌ కు తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్. అంతే నిఖిల్‌ షాక్‌ తిన్నాడు. ఇది ఫేక్‌ అని తను మోసపోయానని గ్రహించి స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొన్న దేవునిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందునుంచి చెబుతున్న ప్రజలు మరల మరల అదే చేస్తున్నారని. ముక్కు మెహం తెలియని వారిని ఎలా నమ్మి డబ్బులు పంపుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. అలాంటివి ఏదైనా మీకు అనుమానం వస్తే మాత్రం పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
Atal Bihari Vajpayee: “అటల్‌” మీకు “సలాం”..