NTV Telugu Site icon

Tension in Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై కొనసాగుతున్న ఆందోళనలు.. నేటితో కౌన్సిలర్ల రాజీనామాకు డెడ్ లైన్

Kamareddy

Kamareddy

Tension in Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో కౌన్సిలర్ల రాజీనామాలకు డెడ్ లైన్ పడనుంది. ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్ల రాజీనామా చేయగా.. నేడు రాజీనామా చేయకపోతే కౌన్సిలర్ల ఇళ్ల ముట్టడిస్తామని.. రేపు కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి జేఏసీ పిలుపు రైతు జేఏసీ చెప్పిన విషయం తెలిసిందే.. దీంతో రైతులు ఏంచేస్తారనేది కౌన్సిలర్లలలో టెన్షన్ మొదలైంది. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా నిన్న మున్సిపల్ కమీషనర్ కు తమ రాజీనామాలు ఇద్దరు కౌన్సిలర్లు సమర్పించారు. రైతు ఐక్యకార్యాచరణ కమిటీకి కౌన్సిలర్లు శ్రీనివాస్, రవి తమ రాజీనామా పత్రాలందించారు. మిగిలిన ఆరు విలీన గ్రామాల కౌన్సిలర్లు 19 లోపు రాజీనామాలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు రైతులు.

Read also: Viral Video: పెళ్లి వేడుకల్లో అపశృతి.. డ్యాన్స్‌ చేస్తూనే కుప్పకూలిన యువకుడు

రాజీనామా చేయకపోతే కౌన్సిలర్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.. రేపు (20న) తేదీలోపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేయించాలని ఎమ్మెల్యేకు జేఏసీ సమావేశం ద్వారా రైతులు మెసేజ్ పంపించారు. ఒకవేళ చేయకపోతే.. 20న ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామంటూ అల్టిమేటం జారీ చేసింది. ఓవైపు కౌన్సిలర్లు, ఇంకోవైపు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పై ఒత్తిడితో కామారెడ్డిలో ఉత్కంఠ కొనసాగుతుంది.

Read also: Hashim Amla: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై రైతు జేఏసీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. మాస్టర్‌ప్లాన్‌లో భూమి పోతుందనే బాధతో రాములు ఆత్మహత్య చేసుకోవడంతో రైతు జేఏసీ ఆందోళనను సీరియస్‌గా తీసుకుంది. ఈ నెల 5న కలెక్టరేట్‌ను ముట్టడించారు. మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అయితే కలెక్టర్‌ దీనిపై క్లారిటీ ఇచ్చినా అయినా రైతులు వెనక్కు తగ్గలేదు. మా భూములు కావాల్సిందే అంటూ ఆందోళనలు చేపట్టారు. అయితే.. ఇవాళ కౌన్సలర్లు రాజీనామా చేయకపోతే పరిస్థితి ఏంటని.. రేపు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి చేస్తామని ప్రకటించడంతో.. ఎమ్మల్యేలలో టెన్షన్‌ మొదలైంది. మరి ఇవాళ కౌన్సిలర్లు రాజీనామా చేస్తారా? లేదా? అనే విషయమై ఉత్కంఠ నెలకొంది.
Bomb Found: రిపబ్లిక్ డే వేడుకలే లక్ష్యం.. మిలిటరీ గ్రౌండ్స్‌లో బాంబు లభ్యం

Show comments