NTV Telugu Site icon

Kamareddy Master Plan: మాస్టర్ ప్లాన్ రద్దుపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేకు మెసేజ్ లు పంపిన రైతులు

Kamareddy Master Plan

Kamareddy Master Plan

Kamareddy Master Plan: రైతుల ఉద్యమానికి సంఘీభావంగా నేడు మున్సిపల్ కమీషనర్ కు తమ రాజీనామాలు కౌన్సిలర్లు సమర్పించనున్నారు. నిన్న రైతు ఐక్యకార్యాచరణ కమిటీకి కౌన్సిలర్లు శ్రీనివాస్, రవి తమ రాజీనామా పత్రాలందించారు. మిగిలిన ఆరు విలీన గ్రామాల కౌన్సిలర్లు 19 లోపు రాజీనామాలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే కౌన్సిలర్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. 20వ తేదీలోపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేయించాలని ఎమ్మెల్యేకు జేఏసీ సమావేశం ద్వారా రైతులు మెసేజ్ పంపించారు. ఒకవేళ చేయకపోతే.. 20న ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామంటూ అల్టిమేటం జారీ చేసింది. ఓవైపు కౌన్సిలర్లు, ఇంకోవైపు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పై ఒత్తిడితో కామారెడ్డిలో ఉత్కంఠ కొనసాగుతుంది.

Read also: Barkat Ali khan Funeral: నేడు అధికార లాంఛనాలతో చివరి నిజాం అంత్యక్రియలు

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై రైతు జేఏసీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. మాస్టర్‌ప్లాన్‌లో భూమి పోతుందనే బాధతో రాములు ఆత్మహత్య చేసుకోవడంతో రైతు జేఏసీ ఆందోళనను సీరియస్‌గా తీసుకుంది. ఈ నెల 5న కలెక్టరేట్‌ను ముట్టడించారు. మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్‌లు మద్దతు ప్రకటించాయి. ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Sridevi: వేలానికి శ్రీదేవి చీరలు.. కొనాలనుకుంటున్నారా..?