Site icon NTV Telugu

సైబర్‌ నేరగాళ్ల వలలో డిప్యూటీ తహసీల్దార్‌.. రూ.3.40 లక్షలు టోకరా..

సైబర్‌ నేరాళ్లు ఎవ్వరినీ వదలడం లేదు.. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అదునుచూసి.. డబ్బును లాగేస్తూనే ఉన్నారు.. ఎంతో మంది ఇప్పటికే కేటగాళ్ల బారినపడి లక్షల్లో డబ్బును పోగొట్టుకున్న ఘటనలు అనేకం.. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్‌ సైతం సైబర్‌ నేరగాళ్ల బారినపడ్డారు. ఈ-కేవైసీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు కామారెడ్డి కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న రంజిత్‌కు వలవేశారు.. అది కేటుగాళ్ల పనిగా గుర్తించని ఆయన.. వివరాలు చెప్పడంతో.. ఆయన ఖాతా నుంచి రూ.3.40 లక్షలు లాగేశారు.. ఇక, అది గుర్తించిన రంజిత్‌.. వెంటనే అప్రమత్తమైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు..

Exit mobile version