Kalvakuntla Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ యాత్ర పేరిట రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో యాత్ర చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అక్టోబర్ చివరి వారంలో తెలంగాణ యాత్ర ప్రారంభించనున్న కవిత తెలిపారు. ఇదిలా ఉంటే.. యాత్ర పోస్టర్లలో కేసీఆర్ ఫోటో లేకుండా, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Masala Fraud : మసాలాల్లో ఎలుకల మలం.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!
ఇది యాత్రలో విద్యావంతులు, మేధావులతో భేటీలను మరింత ప్రతిష్ఠాత్మకంగా మార్చే విధంగా ఉండనుంది. కవిత ఈ యాత్రలో తెలంగాణ సాంప్రదాయ, విద్యా, సాంకేతిక రంగాల్లో కృషిచేసిన వేతరులను, ప్రముఖ మేధావులను కలుస్తూ ప్రజలకు ప్రత్యక్షంగా సందేశాలు చేరుస్తారని తెలుస్తోంది. రేపు యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన అన్ని వివరాలు, షెడ్యూల్‌లు, సమావేశాల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
