Site icon NTV Telugu

MLC Kavitha: కేసీఆర్ మై హీరో.. త్రివిక్రమ్ డైలాగుతో కవిత వీడియో పోస్ట్

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అధికార భారత రాష్ట్ర సమితికి నిరాశ కలిగించాయి. ఓటమి తప్పదన్న సంకేతాలు పంపారు. మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్ ఆశలు నీరుగారిపోయాయి. తెలంగాణలో గురువారం పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన సంగతి తెలిసిందే. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ వైపు చూపించాయి. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా స్పష్టం చేయలేదు. ఒకటి రెండు మినహా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపాయి. హస్తం పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నానికి తేలనుంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ కింది స్థాయి నేతలు కూడా గెలుపుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదని అంటున్నారు.

Read also: Winter Season : చలికాలంలో రోజూ నారింజను తింటే ఏమౌతుందో తెలుసా?

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు జిల్లా కార్యాలయాల్లో సంబరాలు, ఉత్సాహ వాతావరణం కనిపించలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని, తాము అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ను హీరో అని అభివర్ణించారు. నా హీరో అంటూ కేసీఆర్‌తో ఓ చిన్న వీడియో క్లిప్‌ని కవిత పంచుకున్నారు. రచయితగా దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ చెప్పిన డైలాగ్స్‌తో కేసీఆర్ నడుస్తూ వస్తున్న వీడియోను కవిత షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మరింది.

Winter Season : చలికాలంలో రోజూ నారింజను తింటే ఏమౌతుందో తెలుసా?

Exit mobile version