NTV Telugu Site icon

Kadiyam Srihari: అనుచరులతో కడియం భేటీ.. పార్టీ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Kadiyam Srihari

Kadiyam Srihari

Kadiyam Srihari: ఇవాళ అనుచరులతో కడియం భేటీ అయ్యారు. పార్టీ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ నిర్వహించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీ అనంతరం కడియం మాట్లాడుతూ.. రాజకీయ పరిణాలు మారుతున్నాయని తెలిపారు. మనకు వచ్చిన ఆహ్వానం తెలుసన్నారు.
నన్ను ఆశీర్వదించారని తెలిపారు. తన బిడ్డ కావ్యని మీ చేతుల్లో పెడుతున్నా అని.. ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. నాతో పాటు వస్తున్నందుకు ధన్యవాదాలన్నారు. నా నిర్ణయం మీ అందరి రాజకీయ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఉంటుందన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గ్రౌండ్ లోకి వెళ్తే పరిస్థితి బాగాలేదన్నారు. ఎవరెవరికి పడదన్నారు. ఓడిపోయినా పోటీ చేయాలని అనుకున్నానని తెలిపారు. కానీ నాయకుల మధ్య లొల్లి.. పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Call Forwarding : ఏప్రిల్ 15నుంచి కాల్ ఫార్వార్డింగ్ సర్వీసు నిలిపివేత

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో కడియం శ్రీహరి సమావేశమై చర్చలు జరిపారు. పార్టీకి ఆహ్వానం పలుకుతూ వారి రాక పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అనేక కేసులతో కూరుకుపోయిందని కడియం శ్రీహరి అన్నారు. పార్టీలో ప్రధాన నేతలు ఎవరు ఉండే పరిస్థితి లేదన్నారు. చాలా మంది నేతలు బయటకు వస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తండ్రితోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న కడియం కావ్య.. తాను అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు కేసీఆర్ కు లేఖ రాయగా, తండ్రి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇవాళ కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇవాళ జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విజయలక్ష్మి తండ్రి, రాజ్యసభ సభ్యుడు కె.కేశరావు కూడా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Sundeepkishan VIBE: సూపర్ హిట్ డైరెక్టర్ తో ‘వైబ్’ కుదిరిదంటున్న సందీప్ కిషన్..!