Site icon NTV Telugu

KA Paul: కేటీఆర్‌కు వార్నింగ్‌.. నువ్వు పుట్టకముందే ప్రపంచాన్ని వణికించా..

Ka Paul

Ka Paul

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వార్నింగ్‌ ఇచ్చారు కేఏ పాల్.. నువ్వు పుట్టకముందు నేను ప్రపంచాన్ని వణికించానన్నారు.. తనపై దాడి తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈరోజు చీకటి రోజు అన్నారు.. కేసీఆర్, కేటీఆర్ గుండాలతో రాష్ట్రాన్ని నడుపుతున్నారు.. చాలా మంది పోలీస్ కమిషనర్లు, అధికారులు కేసీఆర్ చెప్పినట్టు పనిచేస్తున్నారని ఆరోపించారు. మధ్యాహ్నం 3:30 కి ఈరోజు ఎస్పీకి కేటీఆర్ కాల్ చేసి, కేఏ పాల్ ని రానివ్వకండి అన్ని చెప్పారని.. 50 మంది పోలీసులు వచ్చి నన్ను ఆపారని.. ఇద్దరు గుండాలు పోలీసులతో పాటు వచ్చారు.. నేను అట్టెంప్ట్ టూ మర్డర్ కింద కేసు పెడతానని తెలిపారు. నన్ను కొట్టారు, చంపబోయారు.. తెలంగాణ హోమ్ మినిష్టర్ నాకు సెక్యూరిటీ ఇస్తామన్నారు.. కానీ, హైదరాబాద్ సీపీ ఎవ్వడు కేఏ పాల్ అన్నాడని మండిపడ్డారు.

Read Also: Prashant Kishor : కొత్త పార్టీతో పీకే సక్సెస్‌ అవుతారా..?

నెల రోజుల కిందనే నన్ను చంపుతారు అని చెప్పానన్నారు కేఏ పాల్.. కానీ, నేను దేనికి భయపడను.. అసలైన పోరాటం ప్రారంభం అయ్యిందని ప్రకటించారు. 119 నియోజకవర్గాల్లో నేను పర్యటిస్తానని ప్రకటించారు.. ఇక, తనపై జరిగిన దాడి ఘటనపై హోమ్ మినిష్టర్ అమిత్ షా కి ఫిర్యాదు చేశా.. అధికారులు, ముఖ్య మంత్రిపై హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తా.. రాష్ట్రపతిని కలవబోతున్నాను, ప్రెసిడెంట్ రూల్ కోసం ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు కేఏ పాల్..

Exit mobile version