NTV Telugu Site icon

KA Paul: ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తా..

Ka Paul

Ka Paul

KA Paul Announced Bumper Offer: మునుగోడు నిరుద్యోగ యువతకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన 59వ పుట్టినరోజు సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 59 మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్ట్‌తో పాటు అమెరికన్ విసాను ఉచితంగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం..మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 50 వేల మంది నిరుద్యోగులు తమ రెజ్యూమ్‌లు తీసుకొని, సెప్టెంబర్ 25న శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్‌కి రావాలని సూచించారు. తన జన్మదిన కానుకగా ఇస్తోన్న ఈ సదవకాశాన్ని మునుగోడు యువత అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఇందులో బాగంగా.. నిన్న మునుగోడులో కేఏపాల్‌ 59వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం సభ నిర్వహించారు. 59 మందికి వీసా లక్క్కీడ్రా తీశారు. డ్రాలో గెలుపొందిన వారిని అమెరికా పంపించనున్నారు.

Read also: Ktr to Meet Basar IIIT Students: నేడు బాసరకు కేటీఆర్‌.. ఐఐఐటీ విద్యార్థులతో సమావేశం

ఒక బీసీ కుటుంబంలో పుట్టి, దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న తనకు.. నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని సీఎం కేసీఆర్, సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పి.. ఇంతవరకూ ఆ హామీల్ని నెరవేర్చలేదని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న రాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు. అయితే.. ఉపెన్నికల్లో కోసం పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించినా టీఆర్‌ఎస్‌ ఇంకా ప్రకటించాలేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా.. తమ అభ్యర్థిని గెలిపిస్తే ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తానని.. నియెజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కేఏపాల్‌ నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్‌ పాల్గొన్నారు.
PFI: పీఎఫ్‌ఐపై కూపీ లాగుతున్న ఈడీ.. విదేశాల్లోనూ స్వచ్చంద సంస్థ పేరుతో నిధులు వసూలు