Site icon NTV Telugu

KA Paul: రెస్పెక్ట్ ఇవ్వండి.. నేను తెలంగాణకు కాబోయే సీఎంను..!

Ka Paul

Ka Paul

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఏది చేసినా సంచలనంగా మారుతుంది.. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో హడావుడి చేస్తూ.. నవ్వులు పూయించిన ఆయన.. ఇప్పుడు.. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు.. ఇక్కడ కూడా.. తగ్గేదే లే అనే తరహాలో రెచ్చిపోతున్నారు పాల్.. మునుగోడులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న ఆయన.. ఇవాళ తనను ఆపిన అధికారుపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్ అంటూ.. విధుల్లో ఉన్న ఓ అధికారిపై తన ప్రతాపం చూపాడు. నన్ను ఆపే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ వాగ్వివాదానికి దిగారు.

Read Also: MLA Raghunandan Rao: నాపై సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేస్తా..

అయితే, కేఏ పాల్ కు చెందిన రెండు ప్రచార వాహనాలు చండూరులో ప్రచార నిర్వహిస్తుండగా, వాటి వెనకాలే వస్తున్న కేఏ పాల్ ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్‌కు కోపం వచ్చింది.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్.. నేను పర్మిషన్ తీసుకునే ప్రచారం నిర్వహిస్తున్నా అన్నారు.. నేను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని.. రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ మండిపడ్డారు. సదరు అధికారిని నీ పేరు ఎంటంటూ అధికారి మెడలోని ఐడీ కార్డు లాక్కుని పేరు చూసే ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న అధికారులు.. సదరు అధికారితో పాటు.. కేఏ పాల్‌కు సర్ది చెప్పడంతో కాస్త శాంతించి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఉప ఎన్నికలో తనను గెలిపిస్తే.. మునుగోడును అమెరికా చేసేద్దాం అంటూ ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.. ఏ పార్టీ వల్ల కాని అభివృద్ధి చేసి చూపిస్తాం.. ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నారు కేఏ పాల్.

Exit mobile version