Site icon NTV Telugu

KA Paul : దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ

Ka Paul 2

Ka Paul 2

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్​కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సభ కోసం కాంగ్రెస్ పార్టీ 87కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టారని, ఎప్పుడైనా 70సంవత్సారలలో రైతులకు గిట్టబాటు ధర ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ వాగ్ధానాలు అన్ని వింటే నవ్విస్తుందన్నారు. ఇది కేవలం తెలంగాణ ప్రజలని మోసం చేయడం కోసమేనని, ఎందుకు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ఈ మాయ మాటలు విని ప్రజలు మోసపోఎందుకు సిద్ధంగా లేరన్నా కేఏ పాల్‌.. మీకు దేశంలో ఎక్కడ డిపాజిట్ లు రాలేదన్నారు.

మీరు దేశాన్ని, ప్రజలను మోసం చేశారు… అందుకే మీకు ఈ శిక్ష అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు అంత ఈ కుటుంబ పాలన వద్దు అని అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. పీకే ఒక పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అని కే ఏ పాల్‌ కొత్త పేరు పెట్టారు. ఆయన ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తారో వారి దగ్గరకు వెళ్తారని, నేను 750 కోట్లు ఇస్తాను అని చెప్పాం… కానీ ఆయన కు అంత కంటే కాంగ్రెస్ ఎక్కువ ఇస్తుంది అనుకుంటా? అని ఆయన అన్నారు.

Exit mobile version