NTV Telugu Site icon

KA Paul: ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్‌ సస్పెన్షన్‌.. కేఏ పాల్ ప్రకటన

Ka Paul

Ka Paul

KA Paul: ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్‌ ను సస్సెన్షన్‌ చేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కే.ఏ.పాల్‌ స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. గద్దర్‌ ఢిల్లీలో ప్రెస్‌ మీట్‌ పెట్టి మరో పార్టీ పెట్టడంపై పాల్‌ మండిపడ్డారు. ఇది ఊహకు అతీతంగా లేదా? అంటూ ప్రశ్నించారు. బడుగు, బహీల వర్గాల ప్రజలు ఇది గ్రహించాలని సూచించారు. గత సంవత్సరం అక్టోబర్‌ లో గద్దర్‌ ప్రజాశాంతి పార్టీలో చేరారని తెలిపారు. రేవంత్ రెడ్డి మమ్మల్ని విభజించి గెలవాలని చూస్తున్నారన్నారని ఆరోపించారు. ఇదంతా రేవంత్‌ రెడ్డి కుట్ర అని అన్నారు. షర్మిలను, పొంగిలేటిని, జూపల్లిని కాంగ్రెస్‌ లో చేర్చుకోవడానికి కుట్ర చేస్తున్నాడని అన్నారు. జనాభాలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవులంతా ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. మోసపోకండి. తెలుగు రాష్ట్రాలను కాపాడేందుకు, అభివృద్ధి చేసేందుకు కుల రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

Read also: Love Tragedy: అందుకు ఒప్పుకోలేదని.. ప్రియుడిపై ప్రియురాలి తల్లి దాడి

ప్రముఖ గాయకుడు గద్దర్ తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. గద్దర్ కొత్త పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరును ప్రకటించారు. ఈ క్రమంలో గద్దర్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఎన్నికల కార్యాలయానికి గద్దర్ చేరుకున్నారు. రాజకీయ పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ నమోదు కోసం ఎన్నికల అధికారులతో గద్దర్ సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ సందర్భంగా గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానన్నారు. బంగారు తెలంగాణగా మారలేదు.. కుళ్లు తెలంగాణగా మారిందని తెలిపారు. కేసీఆర్ విధానాలు తప్పని ఆయన సీరియస్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో గద్దర్‌ ను ప్రజాశాంతి పార్టీనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు పాల్‌ ప్రకటించడంతో సంచలనంగా మారింది.
UtterPradesh: లింగ మార్పిడి పేరుతో మహిళ హత్య

Show comments