Site icon NTV Telugu

K. A. Paul: హైదరాబాద్‌లో ప్రపంచ శాంతి సమావేశాలు.. 28 మంది ప్రధానులకు ఆహ్వానం

Ka Paul

Ka Paul

K. A. Paul about World Peace Conferences: ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అక్టోబర్ 2న జింఖాన గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 28 మంది ప్రధానులు రానున్నట్లు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కూడా అందర్ని ఆహ్వానించారు అని తెలిపారు. వరణ్ గాంధీని కూడా ఆహ్వనించినట్లు చెప్పారు. అయితే వరణ్ గాంధీని రావద్దని మంత్రి కేటీఆర్ చెప్పారని..స్వయంగా వరణ్ గాంధీనే ఈ విషయాన్ని చెబుతున్నారని తెలిపారు.

Read Also: Madya Pradesh Serial Killer: “కేజీఎఫ్” రాకీభాయ్‌లా ఫేమస్ అవ్వాలని వరసగా హత్యలు

పనిలో పనిగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై కూడా కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ప్రాసిట్యూట అని సంచలన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడానికి కేసీఆర్ ను వాడుకుంటున్నారని ఆరోపించారు. అక్టోబర్ లో జరగనున్న ప్రపంచ శాంతి సమావేశాలను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శాంతిసభను అడ్డుకునే వారు దేశ, రాష్ట్ర ద్రోహులని అన్నారు. శాంతిసభను అడ్డుకునే వారు దేవుడి శాపానికి గురవుతారని శపించారు. మునుగోడులో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరానని.. కేంద్ర ఎన్నికల కమిషనర్ ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశానని కేఏ పాల్ వెల్లడించారు. హైదరాబాద్ లో నాకు ఓటర్ ఐడీ కార్డు ఇప్పించాలని కోరానని అన్నారు.

Exit mobile version