Viral: ఆ మాజీ మంత్రి కాంగ్రెస్ గూటికి..? సోషల్ మీడియాలో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అదే పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేకు మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మాటల యుద్ధం, విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదుల పర్వం కొనసాగుతూ రాగా.. గత కొంత కాలంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో ఇరువురు నేతలు చేసుకున్న సవాళ్లు ప్రతిసవాళ్ల పర్వంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం కూడా తెలిసిందే.. అయితే, పార్టీకి దూరంగా ఉంటున్న జూపల్లిపై ఎప్పటి నుంచే రకరకాల ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి.. తాజాగా, ఓ ప్రచారం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.. దీంతో.. ఆయన వర్గం క్లారిటీ ఇచ్చే పనిలో పడిపోయింది..
Read Also: Shakuntalam: శాకుంతలం.. సినిమా కాదు.. శతమానం పూర్తిచేసుకున్న ఓ టీచరమ్మ జీవితం..
Also Read
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారిపోయింది.. ఇక, ఈ మధ్య అంతర్గత విభేధాలు రచ్చకు ఎక్కడంతో ఇది నిజమేననే భావన కూడా మొదలైంది.. త్వరలోనే జూపల్లి.. హస్తం పార్టీలో చేరడం ఖాయమనే ప్రచారం గుప్పుమంది.. ఇది కాస్తా, జూపల్లి కృష్ణారావు వరకు వెళ్లింది.. దీంతో, క్లారిటీ ఇచ్చే పనిలో పడిపోయారు జూపల్లి.. సోషల్ మీడియాలలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు.. మీతో చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోను… ఎవ్వరూ నమ్మవద్దు.. అంటూ తన అనుచరులు, పార్టీ శ్రేణులకు మెసేజ్‌లు పెడుతున్నారట మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. మొత్తంగా జూపల్లి ఎలాంటి రాజకీయ వ్యూహాలతో ఉన్నారో తెలియదు.. కానీ, ఆయన ప్రత్యర్థులు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. అయినా, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. రాష్ట్రంలో పొలిటికల్ జంపింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి.. మరి జూపల్లి కృష్ణారావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కాలమే చెబుతుంది.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!