Site icon NTV Telugu

Jupally Krishna Rao : కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఏం చేయోచ్చో.. రెండేళ్ల‌లో చేసి చూపించాం

Jupally

Jupally

Jupally Krishna Rao : పేద‌లు క‌ష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తున్నారు. గ‌తంలో పాలించిన కేసీఆర్ పుణ్యమ‌ని ధ‌నిక రాష్ట్రం అప్పుల కుప్ప‌గా త‌యారైంది.రూ. 8 ల‌క్ష‌ల కోట్ల రూపాయల అప్పుల చేస్తే.. దానికి ప్ర‌తీ నెల ప్ర‌జా ప్ర‌భుత్వం వ‌డ్డీ చెల్లిస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఈ రెండేళ్లలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్ లో రూ. 260.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.

అన్ని వ‌ర్గాల విద్యార్థులకు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు ఆదిలాబాద్ లో యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్ కు పునాదిరాయి వేసుకున్నాం. ఆదిలాబాద్ లో ఏయిర్ పోర్టు ఏర్పాటుకు 700 ఎక‌రాల భూసేక‌ర‌ణ కోసం సీయం ఉత్త‌ర్వులు జారీ చేశారు. అంతేకాకుండా 61 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేశాం. రానున్న రోజుల్లో మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తాం. చ‌నాక‌- కొరాట బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయ‌డంలో గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింది. ప‌దేండ్ల‌లో ఒక ఎక‌రానికి కూడా సాగునీరు ఇవ్వ‌లేక‌పోయింది. చ‌నాక – కొరాట బ్యారేజ్ పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేసి ప్రారంభిస్తామ‌ని హామీనిచ్చారు.

గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రైతుల‌కు పంట‌న‌ష్టం ఇవ్వ‌లేదు. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎక‌రానికి రూ.10 వేల పంట‌న‌ష్టం ఇస్తుంది. మిగిలిన రైతుల‌కు నివేదిక ఆధారంగా పంట‌న‌ష్టం చెల్లిస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఏం చేయోచ్చో.. రెండేళ్ల‌లో చేసి చూపించాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, సబ్సిడీ గ్యాస్ – నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిర‌మ్మ ఇండ్లు, రైతులకు రూ.21 వేల కోట్లకు పైగా రుణమాఫీ, స‌న్నాల‌కు రూ. 500 బోన‌స్ వంటి అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని వివ‌రించారు.

బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి తెలంగాణ రైజింగ్ – 2047 విజ‌న్ డాక్యుమెంట్ ను ప్ర‌భుత్వం రూపొందించింది.ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ స్థాయిలో రాష్ట్రం అగ్రగామిగా ఉండేందుకు లక్ష్యాలను నిర్దేశించనున్నాం. క్రీడలు, పర్యాటకం, వాణిజ్యం, పరిశ్రమలు, ప్రకృతి వ్యవసాయం ఇవన్నీ కూడా రాష్ట్ర పాలసీలో భాగంగా ముందుకెళ్తున్నామ‌ని పేర్కొన్నారు.

మినీ కాశ్మీర్ గా పేరొందిన ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ను ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. త‌ద్వారా స్థానికుల‌కు ఉద్యోగ‌, ఉపాధి అవకాశాలు క‌ల్పిస్తామ‌న్నారు. అర్హులైన ల‌బ్ధిదారుల‌కు సంక్షేమ ఫ‌లాలు అందేలా కృషి చేస్తాన‌ని హామీనిచ్చారు.

Pakistan: విమాన సంస్థను అమ్ముతున్న పాక్ ప్రభుత్వం.. కొనుగోలు చేయనున్న పాక్ ఆర్మీ.. ఇదే వింత..

Exit mobile version