Jupally Krishna Rao : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయోచ్చో.. రెండేళ్లలో చేసి చూపించాం
- రేవంత్ రెడ్డి అభివృద్ధి శంకుస్థాపనలు
- ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు గ్రీన్ సిగ్నల్
- ఉద్యోగాల భర్తీపై జూపల్లి హామీ
- బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao : పేదలు కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. గతంలో పాలించిన కేసీఆర్ పుణ్యమని ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైంది.రూ. 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల చేస్తే.. దానికి ప్రతీ నెల ప్రజా ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్ లో రూ. 260.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.
అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆదిలాబాద్ లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు పునాదిరాయి వేసుకున్నాం. ఆదిలాబాద్ లో ఏయిర్ పోర్టు ఏర్పాటుకు 700 ఎకరాల భూసేకరణ కోసం సీయం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా 61 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. రానున్న రోజుల్లో మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. చనాక- కొరాట బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పదేండ్లలో ఒక ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయింది. చనాక – కొరాట బ్యారేజ్ పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రారంభిస్తామని హామీనిచ్చారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పంటనష్టం ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల పంటనష్టం ఇస్తుంది. మిగిలిన రైతులకు నివేదిక ఆధారంగా పంటనష్టం చెల్లిస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయోచ్చో.. రెండేళ్లలో చేసి చూపించాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, సబ్సిడీ గ్యాస్ – నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు రూ.21 వేల కోట్లకు పైగా రుణమాఫీ, సన్నాలకు రూ. 500 బోనస్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.
బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం రూపొందించింది.ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ స్థాయిలో రాష్ట్రం అగ్రగామిగా ఉండేందుకు లక్ష్యాలను నిర్దేశించనున్నాం. క్రీడలు, పర్యాటకం, వాణిజ్యం, పరిశ్రమలు, ప్రకృతి వ్యవసాయం ఇవన్నీ కూడా రాష్ట్ర పాలసీలో భాగంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
మినీ కాశ్మీర్ గా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని హామీనిచ్చారు.
Pakistan: విమాన సంస్థను అమ్ముతున్న పాక్ ప్రభుత్వం.. కొనుగోలు చేయనున్న పాక్ ఆర్మీ.. ఇదే వింత..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!