NTV Telugu Site icon

TS Congress: భట్టితో జూపల్లి భేటీ.. కొల్లాపూర్ సభపై చర్చ

Jupalli Bhatti

Jupalli Bhatti

TS Congress: సిఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆయన నివాసంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ లోని భట్టి నివాసానికి వచ్చి ఆయనతో పలు అంశాలపై చర్చించారు. త్వరలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జూపల్లి కృష్ణారావు ఈ విషయమై భట్టి విక్రమార్కతో మంతనాలు జరిపారు. కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా కొల్లాపూర్ లో నిర్వహించనున్న సభ, ఇతర నేతల చేరికపై చర్చించినట్లు సమాచారం.

అనంతరం జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. కొల్లాపూర్‌లో జరిగే బహిరంగ సభకు ఆహ్వానం పలికేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. లాంగ్ మార్చ్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు భట్టి విక్రమార్కను అభినందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు చెందిన నేతలు నిన్న సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తాం సమావేశమయ్యారు. వారంతా కాంగ్రెస్‌లో చేరతారని చెప్పారు. కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభకి భట్టిని ఆహ్వానించామన్నారు. పాదయాత్ర ముగించిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. వచ్చే 10 రోజుల్లో నియోజక వర్గాల వారిగా సమావేశం.. ఇంఛార్జీల నియామకం కూడా చేస్తామన్నారు. 14 నియోజక వర్గాల నేతలు చేరతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల.. ఆయన కుమారుడు చేరతారని స్పష్టం చేశారు. కొడంగల్ గురునాథ్ రెడ్డి.. ఆయన కుమారులు చేరతారని అన్నారు. ఈ సభతో బీఆర్ఎస్ పతనం మొదలైతుందన్నారు. లక్షల మందిని కొల్లాపూర్ లో పోగు చేస్తామన్నారు. ప్రియాంక గాంధీ సభ తేదీ ఏఐసీసీ త్వరలో ప్రకటిస్తారని అన్నారు. పాలమూరు లో కాంగ్రెస్ కి మంచిరోజులు వస్తాయని జూపల్లి అన్నారు.

సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి జూపల్లి కృష్ణారావు చేరికను స్వాగతిస్తున్నామన్నారు. ఆయన అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కొల్లాపూర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. జూపల్లి ఆయన అనుభవం కాంగ్రెస్ కి ఉపయోగ పడుతుందన్నారు. చేరిక కోసం భారీ సభ నిర్వహిస్తున్నారని, ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. తెలంగాణా ప్రజల ఆశలు.. ఆకాంక్షలు.. కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. సభ తేదీ.. ఏఐసీసీ త్వరలో ప్రకటిస్తారని స్పష్టం చేశారు. త్వరలోనే రాహుల్ గాంధీని కలుస్తానని అన్నారు. పాదయాత్ర పై బుక్ రిలీజ్ చేస్తామన్నారు. మోడీ..కేసీఆర్ ఒక్కటే అన్నారు. కేసీఆర్ కి అనుకూలమైన వ్యక్తి ని బీజేపీ అధ్యక్దుడుగా నియమించారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోరుకున్న వ్యక్తిని పార్టీ అధ్యక్దుడుగా పెట్టింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అంత అవినీతి పరుడు అయితే..చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. మోడీ ప్రధాని స్థాయి మరిచి పోయారని మండిపడ్డారు. మాటలు చెప్పే ప్రధాని మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కి కావాల్సిన కేసులు ఎత్తివేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, ఐటీ దాడులు చేసి ఏం చేశావు మోడీ? అని ప్రశ్నించారు. కేసీఆర్ సూచన మేరకే కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్దుడుగా నియమించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి వ్యతిరేక అద్యక్షుడుని మార్చేసింది బీఆర్ఎస్ కి మేలు చేయడం కోసమే అని భట్టి అన్నారు. ఈడీ, ఐటీ దాడులు చేసి.. వదిలేసింది ఎందుకో సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.
Devineni Avinash: టీడీపీ నేతల మాటలు జోకర్ల మాటల్ని తలపిస్తాయి.. దేవినేని అవినాష్ విసుర్లు