Site icon NTV Telugu

TG Junior Doctors: నేడు రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మె… OP, OT సేవలు బంద్‌..

Tg Junior Doctors

Tg Junior Doctors

జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నెలనెలా ఉపకార వేతనాలు చెల్లించడమే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా వారు నిరసనలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు లేవని, ప్రభుత్వం నుంచి వచ్చే నెలనెలా ఉపకార వేతనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో OP సేవలు, తాత్కాలిక OT సేవలను బహిష్కరించి జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.

Read also: BRS MLA Sanjay Kumar: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్‌ షాక్.. హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే

స్టై ఫండ్ రెగ్యులర్ గా రావాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ పూర్తయిన పీజీ లకు ఖచ్చితంగా ప్రభుత్వ సర్వీస్ అని పెట్టి 2.5లక్షలు ఇస్తామన్నారు నెలకు.. ఇప్పుడు 92వేలు ఇస్తా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. NMC గైడ్ లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి సరిగ్గా ఇవ్వడం లేదని మండిపడ్డారు. డాక్టర్ల పై పేషంట్స్ బందువుల నుంచి జరుగుతున్న దాడులు ఆపాలని అన్నారు. పని ప్రదేశాల్లో భద్రత పెంచాలన్నారు. ఉస్మానియా కొత్త భవన నిర్మాణం… చేపట్టాలని అన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీలో సరైన రోడ్డు వసతి లేక ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. PG లకు రెండు నెలలుగా, హౌస్ సర్జన్ కు మూడు నెలలు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు 6 నెలల నుండి స్టయిఫండ్ రావాలని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్టైఫండ్ ను సకాలంలో విడుదల చేయాలంటున్నారు.
Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీలో మరో స్టార్ హీరో..?

Exit mobile version