NTV Telugu Site icon

జూడాల ఆందోళ‌న బాట‌.. విధుల బ‌హిష్క‌ర‌ణ‌కు రెడీ..

junior doctors

క‌రోనా క్లిష్ట స‌మ‌యంలో సేవ‌లు అందించాల్సిన జూనియ‌ర్ డాక్ట‌ర్లు మ‌ళ్లీ ఆందోళ‌న‌కు సిద్ధం అవుతున్నారు.. ఈ నెల 26వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తామ‌ని ప్ర‌క‌టించారు జూడాలు.. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 15 శాతం స్టై ఫండ్ పెంచాల‌ని డిమాండ్ చేస్తున్న జూనియ‌ర్ వైద్యులు.. ప్రకటించిన విధంగా 10 శాతం ఇన్సెంటివ్స్ వెంటనే చెల్లించాల‌ని కోరుతున్నారు.. ఇక‌, కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే… నిమ్స్ లో వైద్యం అందించేలా ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను అమ‌లు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.. ఇక‌, కరోనా విధుల్లో మృతి చెందిన వారికి ప్ర‌భుత్వం ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాల‌ని మ‌రో డిమాండ్ చేర్చారు.. కాగా, ఈ మ‌ధ్య గాంధీ ఆస్ప‌త్రిని ప‌రిశీలించిన సీఎం కేసీఆర్.. క‌రోనా రోగుల‌ను ప‌రామ‌ర్శించ‌డంతో పాటు.. వైద్యులు, జూనియ‌ర్ డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది, న‌ర్సుల ప‌రితీరును ప్ర‌శంసించారు.. ప్రాణాలు తెగించి వైద్య సేవ‌లు అందిస్తున్నార‌ని.. జూనియ‌ర్ డాక్ట‌ర్లు, న‌ర్సుల అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.