దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నతమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు.. ప్రస్తుతం అత్యవసర సేవలు మినహా మిగతా విధుల బహిష్కరణ కొనసాగిస్తోంది తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్… అయితే, ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన లేక పోవడంతో.. రేపటి నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరించనున్నట్టు ప్రకటించారు.. ఈ నెల 10వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చారు జూడాలు… పక్షం రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో పేర్కొన్నారు.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాలు తెలిపారు.. మరోవైపు.. జూడాలపై సమ్మెపై స్పందించిన మంత్రి కేటీఆర్.. సమ్మె చేసేందుకు ఇది సమయం కాదని.. వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.. సమ్మె విరమించాల్సిందిగా కోరిన ఆయన.. లేదంటే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.. ఇక, తాజాగా మీడియాతో మాట్లాడిన ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు.. ప్రభుత్వం నుంచి తమ డిమాండ్ల పై సానుకూల స్పందన రాలేదని.. దీంతో.. రేపటి నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.. ప్రభుత్వం నుండి స్పందన రాలేదు.. ప్రతి స్పందన వస్తోంది.. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపటి నుండి అత్యవసర సేవలు నిలిపివేస్తున్నామని ప్రకటించారు.
జూడాల సమ్మె ఉధృతం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..!
Junior Doctors