హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో దర్యాప్తును పోలీసులు వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా ఇవాళ మొత్తం ఐదుగురు మైనర్లను కలిపి విచారణ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. ఘటన ఎలా జరిగింది ? అనే దానిపై ఇప్పటివరకు పోలీసులు వివరాలను సేకరించారు. విచారణలో భాగంగా మైనర్లతో పాటు కొందరు వ్యక్తులు చెప్పిన స్టేట్మెంట్లను రికార్డు చేశారు. కేసుతో ముడిపడిన సాంకేతిక, వైద్యపరమైన, శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించారు. ముగ్గురు మైనర్ల పోలీసు కస్టడీ గడువు నేటితో ముగియనుండగా, మరో ఇద్దరి గడువు రేపటితో ముగియనుంది.
జూబ్లీహిల్స్ బాలికపై అఘాయిత్యం కేసులో నిన్న మైనర్ల మూడో రోజు కస్టడీ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు అన్ని కోణాల్లో ప్రశ్నించిన పోలీసులు అనేక వివరాలు సేకరించారు. కేసులో ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ చెప్పిన వివరాలను మైనర్లు చెప్పిన సమాధానాలతో సరిపోల్చుకున్నట్లు సమాచారం. ఐదుగురు మైనర్లను వివిధ కోణాల్లో విచారించిన అనంతరం జువైనల్ హోంకు తరలించారు.
ఇదిలా ఉంటే పోలీస్ కస్టడీలో మైనర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నవిషయం తెలిసిందే. సాదుద్దీన్ రెచ్చగొట్టడం వల్లే అఘాయిత్యం చేసినట్లు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బాలిక కేసులో అరెస్టైన నలుగురు నిందితులను జువైనల్ కోర్టు ఈ నెల 11వ తేదీ నుంచి నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. కోర్టు ఇచ్చిన గడువు నేటితో.. మంగళవారంతో ముగియనుంది. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ కస్టడీ ఆదివారంతో ముగియడంతో పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు తరలించిన విషయం తెలిసిందే..
Jubilee Hills Case: అంతా నీ వల్లే.. కాదు నువ్వే కారణం.. తన్నుకున్న మైనర్లు..!
