NTV Telugu Site icon

Jubilee Hills Gang Rape Case: ఇన్నోవా కారు స్వాధీనం.. వెలుగులోకి సంచలన విషయాలు

Jubilee Hills Minor Girl Ra

Jubilee Hills Minor Girl Ra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని ప్రతిపక్షాలు పోలీసులు, అధికార టీఆర్ఎస్ పార్టీపై ఒత్తడి పెంచుతున్నాయి. గత రెండు రోజులుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కేసులో నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్ట్ లో ప్రవేశపెట్టారు.

కేసులో అత్యంత కీలకంగా మారిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులోనే బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసు మొత్తానికి ఈ కారు కీలకంగా మారింది. వాహనంలో లైంగిక దాడి జరిగితే పలు సాంతకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే క్లూస్ టీం కార్ లోని ఆధారాలను సేకరించే పనిలో ఉంది. అయితే ఆధారాలు చెరిపివేసిన తర్వాతే కారును పోలీసులకు దొరికేలా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆరు రోజుల తర్వాత కార్ దొరికేలా చేయడంతో టెక్నికల్ ఎవిడెన్స్ ను ఎంతమేరకు సేకరిస్తారో అనేది సవాల్ గా మారింది.

ఇదిలా ఉంటే ఆమ్నేషియా పబ్ లో పార్టీ నిర్వహించిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిషాన్, ఆదిత్య, ఇషాన్ పార్టీ బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ కార్పొరేట్ స్కూల్ ఫేర్ వెల్ పార్టీ కోసం పబ్ బుక్ చేసినట్లు గుర్తించారు. 150 మంది విద్యార్థుల కోసం పబ్ బుక్ ను నిర్వాహకులు బుక్ చేశారు. పార్టీ కోసం రూ. 2 లక్షలను చెల్లించారని తెలుస్తోంది. ప్లస్ టూ విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు.