జూబ్లీహిల్స్ అమ్మాయి అత్యాచారం కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. నిందితులను విచారిస్తున్నారు. గురువారం కేసులో కీలకంగా ఉన్న మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు విచారించారు. దాదాపుగా 5 గంటలు పాటు విచారణ కొనసాగింది. ఫోన్ సీడీఆర్ డేటా, సీసీ కెమెరా ఫులేజ్ ను ముందుపెట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాదుద్దీన్ మాలిక్ కు మైనర్లతో ఉన్న పరిచయాలు, సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులే కాకుండా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనలో నిందితులు రిమాండ్ రిపోర్ట్ లో సంచనల విషయాలు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే మనవడు, పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడిపైనే ప్రధాన ఆరోపణలు వస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేటర్ కుమారుడే బాలికను ట్రాప్ చేశాడని మిగతా నిందితులు వెల్లడించారు. పబ్ బయటక కార్పోరేటర్ కుమారుడే మాయమాటలు చెప్పి బాలికను కారులో ఎక్కించాడని వెల్లడించారు. బెంజ్ కారులో మొదటగా ఎమ్మెల్యే కుమారుడే బాలికపై అసభ్యంగా వ్యవహరించాడని.. కాన్సూ బేకరీ వద్దకు వెళ్లగానే ముందు సీట్లో ఉన్న సాదుద్దీన్ వెనక సీట్లోకి మారాడని నిందితులు తెలిపారు. సాదుద్దీన్ బాలికపై లైంగిక దాడి చేశాడని తెలిపారు. కాన్సూ బేకరీ దగ్గర బాలికను కార్లోనే కూర్చోబెట్టామని.. బేకరీలో అందరూ ఫుడ్, సిగరేట్లు తాగారని నిందితులు రిపోర్ట్ లో తెలిపారు. అందరూ కలిసి ఇన్నోవా కారులో పబ్ కు బయల్దేరాం అని..బాలిక సెల్ ఫోన్, కళ్లద్దాలు బలవంతంగా లాక్కున్నామని.. ఇవి కావాలంటే ఇన్నోవాలో ఎక్కాలని బెదిరించామని నిందితులు వెల్లడించారు. ఇన్నోవాలో ఎక్కిన తర్వాత ఒకరి తర్వాత ఒకరం లైంగిక దాడి చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రోజు నిందితుడు సాదుద్దీన్ మాలిక్ విచారణ జరిగింది. తాజాగా ఈ కేసులో జువనైల్స్‌ను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. రేపటి నుంచి 5 రోజుల పాటు విచారణ కోసం పోలీస్ కస్టడీకి అప్పగించింది. 14వ తేదీ సాయంత్రం జువైనల్స్ ను పోలీసులు విచారించనున్నారు.
