జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు రోజు రోజుకు సంచలనంగా మారుతున్న నేపథ్యంలో.. బాలిక వీడియోలను, ఫోటోలను బయటరావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. వైరల్ చేసిన వారిని ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలి ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే.. జూబ్లీహిల్స్ ఘటనపై వీడియో, ఫోటోలను వైరల్ చేసిన ఒకరిని అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. సిల్వేరి అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు, వీడియోలను వెంటనే డిలీట్ చేయాలన్నారు. ఆ మేరకు ఫేస్ బుక్ లీగల్ సెల్ కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. అమ్నేషియా పబ్ ఘటనలో మైనర్ బాలిక ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అత్యాచార ఘటనల్లో బాధితుల వివరాలు కానీ ఫొటోలు కానీ బహిర్గతం చేయకూడదు.
అయితే ఇప్పటికే పాతబస్తీకి చెందిన సుభాన్.. ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించడంతో.. వెంటనే అతడిని జూన్ 6న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇతడు యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈ కేసుకు సంబంధించిన వీడియోలను ప్రెస్ మీట్‌లో బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ వీడియోలు మరింత వైరల్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేసారు.
అయితే, కేసులకు భయపడేవారు ఎవరూ లేరని రఘునందన్‌రావు నాటి ప్రెస్ మీట్‌లోనే స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని భయపెట్టాలి తప్ప, మమ్మల్ని కాదని ఆయన అన్నారు. ‘మేం ప్రెస్ మీట్లు పెట్టేంత వరకు మీ విచారణ ఏమైంది? అధికారులూ.. ఆధారాలను చెరిపేయకండి’ అని రఘునందన్ రావు హెచ్చరించారు. నిర్భయ కేసులోనూ మైనర్ల పేర్లు, ఫొటోలు బయటకు వచ్చాయంటూ ఆయన తన చర్యను సమర్థించుకున్నారు.
Jubilee Hills Rape Case: మొత్తం ఆరుగురు.. మూడో రోజు సాదుద్దీన్ విచారణ