NTV Telugu Site icon

Devara Trailer: మీ రియాక్షన్స్ అన్నీ విన్నా.. దేవర ట్రైలర్ పై ఎన్టీఆర్ కామెంట్స్!!

Jr Ntr

Jr Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈరోజు సాయంత్రం రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కి ఈ సినిమా రెడీ అయింది. ఇవాళ సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను సాయంత్రం రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ మీద మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ భలే అద్భుతంగా ఉందని అభిమానులతో పాటు ఒక వర్గం వారు అంటుంటే ఇదేంట్రా ఇలా ఉంది? కొరటాలకి మళ్లీ తేడా పడేటట్టుందే అని మరో వర్గం వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ముంబైలో ప్రమోషన్స్ బిజీ బిజీగా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా ట్రైలర్ రెస్పాన్స్ గురించి సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. ఈ మేరకు తన వాట్సాప్ ఛానల్ ద్వారా ఆయన ఒక స్పెషల్ నోట్ షేర్ అభిమానులకు షేర్ చేసుకున్నాడు. దేవర ట్రైలర్ కి మీ రెస్పాన్స్ చూసి నేను చాలా హ్యపీగా ఉన్నాను. సెప్టెంబర్ 27న కలుద్దాం. నా మీద, దేవర మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు థాంక్స్ అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఇక దేవర సినిమాను యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేని పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.

Atchannaidu: పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు.. మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు

Show comments