Jagga Reddy: ఏఐసీసీ కంటే ఇక్కడ తోపులు ఎవరూ లేరని చేరికల సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు పార్టీలో చేరినా చేర్చుకుంటామన్నారు. పార్టీకి నష్టం చేసినవాళ్ళు అయినా.. చేర్చుకోవాలని ఏఐసీసీ ఆదేశించిందన్నారు. నాయకులు ఎవరు నారాజ్ కావద్దు..కలిసి పని చేయాల్సిందే అని తెలిపారు. నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు వచ్చి చేరినా నేను అభ్యంతరం చెప్పరన్నారు. ఏఐసీసీ కంటే ఇక్కడ తోపులు ఎవరూ లేరని.. చేరికల సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కోదండరెడ్డి అన్నారు. జగ్గారెడ్డి, కోదండ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు చేరికలు ఉంటాయన్నారు. ఎన్నికల వరకు పార్టీలో పని చేసి.. ఎన్నికల సమయంలో కొందరు బయటకు వెళ్లారన్నారు.
Read also: DK. Aruna: డిసెంబర్ 9న రెండు లక్షల రైతు రుణమాఫీ అన్నారు ఏది? డీకే అరుణ ఫైర్
వాళ్ళందరి విషయంలో పార్టీ తిరిగి చేర్చుకోవాలని ఏఐసీసీ, పీసీసీ కి ఆదేశించిందన్నారు బీఆర్ఎస్ నుండి ఎవరు వచ్చినా చేర్చుకోండి అని ఆదేశాలు ఉన్నాయన్నారు. ఎవరు పార్టీలోకి రావాలని అనుకున్నా కండువా కప్పేస్తామన్నారు. కండిషన్ తో చేరికలు ఉండవన్నారు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళ తో కొంత స్థానిక నాయకులకు ఇబ్బంది ఉంటదన్నారు. నా దగ్గర నాకు వ్యతిరేకంగా కొందరు పని చేశారు.. వాళ్ళ తో ఓడిపోయిన ఎందుకు చేర్చుకోవాలని నాకు కోపం ఉంటది కానీ.. పార్టీ ఆదేశించింది కాబట్టి కండువా కప్పాల్సిందే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ కంటే తోపులు ఇక్కడ ఎవరు లేరన్నారు. పార్టీలో చేరినా.. వాళ్ళు కాంగ్రెస్ ఇంఛార్జి లు.. ఎమ్మెల్యేల కిందనే పని చేయాలని పార్టీ ఆదేశం అన్నారు.
Read also: Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుంది..
పార్టీలోకి చేరే వాళ్లంతా డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. జవాబుదారీగా చేరికలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఓడిపోయినా వాళ్ళు నారాజ్ కావద్దన్నారు. మీడియాకు ఎక్కోద్దు, ఇది అధిష్టానం ఆదేశం అన్నారు. అందరూ కలిసి పని చేయాల్సిందే అన్నారు. కాంగ్రెస్ కి నిర్దిష్ట సిద్ధాంతం.. నియమాలు ఉన్నాయని కోదండ రెడ్డి అన్నారు. ప్రాంతీయ పార్టీలకు అవకాశవాదమే ఎజెండా అన్నారు. బీజేపీ కూడా రూపాంతరం చెందిందన్నారు. అద్వానీ, మోడీ వేరు వెరూ పద్దతిలో విధ్వంసం చేశారన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు.
Harish Rao: రేపు గన్ పార్క్ దగ్గర వస్తా.. నీకు దమ్ముంటే రా..? రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్..