NTV Telugu Site icon

Jupally Krishna Rao: కాంగ్రెస్ లోనే కృష్ణ మోహన్.. కేటీఆర్ ను కలిసింది అందుకే.. జూపల్లి క్లారిటీ

Jupalli Krishna Mohan

Jupalli Krishna Mohan

Jupally Krishna Rao: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. రెండు రోజుల క్రితం ఆయన మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణ మోహన్ బీఆర్ఎస్ లో చేరుతారన్న వార్తపై జూపల్లి స్పందించారు. అనంతరం జూపల్లి మాట్లాడుతూ.. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

Read also: Minister Narayana: ఖజానా ఖాళీ.. అన్ని శాఖల్లో అప్పులే..!

నియోజకవర్గ అభివృద్ధి నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. గద్వాల రైతాంగానికి అన్ని విధాల ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఎమ్మెల్యే అనుచరులపై కేసులు.. సమాచారం లోపంతో ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుతామన్నారు. కృష్ణమోహన్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులతో ఉన్న అనుబంధం నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ ను గానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గాని కలిశారని క్లారిటీ ఇచ్చారు. అయితే మీడియాతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడేందుకు నిరాకరించారు. జూపల్లితో పాటే హైదరాబాద్ కు గద్వాల ఎమ్మెల్యే బయలుదేరారు. కాగా.. గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కూడా జూలై 6న కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.

Read also: Schools Holidays: విద్యార్థులకు పండగే..! ఆగస్టులో పాఠశాలలకు ఏకంగా 9 రోజులు సెలవులు..

రెండ్రోజుల ముందే ప్రకటించారు.. ఇంతలోనే..

మరోవైపు మంగళవారం (రెండు రోజుల) క్రితం బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని తెలంగాణలోని గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఇటీవలే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన మంగళవారం అసెంబ్లీ లాబీలోని ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఛాంబర్‌కు వెళ్లారు. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కేసీఆర్ కోరిన సంగతి తెలిసిందే. తాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనని చెప్పిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. గులాబీ పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు. త్వరలో కేసీఆర్‌ను కలుస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరి కేటీఆర్ ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ తరుణంలో ఈ అనూహ్య పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Read also: Fastag New Rules: ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు..ఆ తప్పులు చేస్తే బ్లాక్‌లిస్ట్!

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఇప్పటివరకు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరిందని చర్చలు దుమారం రేపాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 75 నుంచి 74కి పడిపోయిందంటూ.. వార్తలు వచ్చాయి. అంతేకాదు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి యూ టర్న్‌ తీసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దుమారం రేపాయి. అయితే జూపల్లి మంతనాలతో కృష్ణ మోహన్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోనే కొనసాగుతారని కృష్ణ మోహన్ మీడియా ముందు నోరు మెదకపోవడం.. దీనిపై జాపల్లి క్లారిటీ ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. అయితే కృష్ణ మోహన్ త్వరలో కేసీఆర్ ను కలుస్తా అంటూ ఇచ్చిన క్లారిటీ ఏమో గానీ.. మరి బీఆర్ఎస్ లో వెళ్లనున్నారా? లేక కాంగ్రెస్ లోనే కొనసాగుతారా? అనే దానిపై కృష్ణ మోహన్ క్లారిటీ ఇస్తే గానీ.. ఈ మాటలకు తెరపడే అవకాశం లేదు. మరి ఈ వార్తలకు కృష్ణ మోహన్ ఎలా స్పందించనున్నారు అనే దానిపై ఆశక్తి నెలకొంది.
Bank Holiday in August: ఆగస్టులో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏకంగా 13 రోజులు