NTV Telugu Site icon

B.Krishna Mohan: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే..?

B.krishna Mohan

B.krishna Mohan

B.Krishna Mohan: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. కారు గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్ మంత్రి జూపల్లిని కలిశారు. మరో రెండు, మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ అధిష్ఠానం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపు ఖాయమని, వారం రోజుల్లోగా ఎప్పుడైనా బీఆర్ ఎస్ వీడనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఇదే విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని సంప్రదించగా… పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాత చేరికపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. పార్టీ మారాలని అనుచరుల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. మండలాల వారీగా అభిప్రాయ సేకరణ చేస్తున్నా అని తెలిపారు. నియోజక వర్గ ప్రయోజనాల కోసమే పార్టీ మార్పు ఆలోచన అన్నారు. అందరి నిర్ణయం మేరకే తుది నిర్ణయం అన్నారు.

Read also: CM Chandrababu: ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ!

స్థానిక ఎమ్మెల్యే, గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితకు మధ్య విబేధాలు తారా స్థాయికి చేరడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే మొదట తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కృష్ణమోహన్ రెడ్డి 2009లో గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో 2014లో పార్టీలో చేరి మళ్లీ గద్వాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018, 2023 సార్వత్రిక ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా సరిత పదవీకాలం నేటితో ముగియనుంది.
Boyfriend Harassment: నా చావుకు అతడే కారణం.. యువతి సూసైడ్ నోట్ వైరల్..

Show comments