Site icon NTV Telugu

Big News : తెలంగాణలో మరో నోఫికేషన్‌ విడుదల

Telangana Fire

Telangana Fire

తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇప్పటికే పలు శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసిన తెలంగాణ సర్కార్‌.. ఇప్పుడు మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణాలో ఇప్పటికే పోలీస్ , గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రాష్ట్రంలో అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నియామక మండలి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఇంటర్ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడంతో పాటు.. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే 25 ఏళ్ళు మించకూడదు. అంతేకాకుండా గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లు సడలింపు చేసి చక్కని అవకాశం కల్పిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 26 రాత్రి 10గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Exit mobile version