Charlapalli Jail: చర్లపల్లి జైలులో జాబ్ మేళా.. ఖైదీలకు ఉపాధి కల్పించనున్న జైళ్ల శాఖ
- చర్లపల్లి జైలులో జాబ్ మేళా
- క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు సెంట్రల్ జైలులో జాబ్ మేళా
- 213 మందికి క్షమాభిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charlapalli Jail: మారిపోయిన ఖైదీలను కేవలం జైలు నుంచి వదిలేయడమే కాకుండా వారికి ఉపాధి ఏర్పాటు చేసి బయటకు పంపించాలని అధికారులు నిర్ణయించారు. క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు నేడు చర్లపల్లి సెంట్రల్ జైలులో జాబ్ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లల్లో 213 మంది క్షమాభిక్షకు ఎంపిక చేశారు. క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలకు జాబ్ మేళా ద్వారా జైళ్ల శాఖ అధికారులు ఉపాధి కల్పించనున్నారు. ఆసక్తి, అర్హత మేరకు విడుదల కానున్న ఖైదీలకు ఉపాధి కల్పించనున్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకులతోపాటు డ్రైవర్లు, డేటా ఆపరేటర్లు, ఇతర విభాగాల్లో వారి ఆసక్తి మేరకు ఖైదీలకు ఉపాధి అవకాశం లభించనుంది. అవసరమైన వారికి అర్హత బట్టి ప్రైవేటు సంస్థల్లో కూడా ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
Read Also: MLC Kavitha: కవితకు జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఇప్పటికే ఖైదీల విడుదలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. చర్లపల్లి జైలులో జరిగే జాబ్ మేళా కార్యక్రమానికి ఐజీ వై రాజేష్, డీఐజీ మురళి బాబు, జైళ్ల శాఖ అధికారులు హాజరు కానున్నారు.తెలంగాణలోని అన్ని జైళ్ల నుంచి అధికారులు ఖైదీలను విడుదల చేయనున్నారు. ఇతర జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలను ఇప్పటికే అధికారులు చర్లపల్లి జైలుకు తీసుకువచ్చారు. 213 మంది ఖైదీలు నేడు విడుదల కానున్నారు. ఇప్పటికే జైలు వద్దకు ఖైదీల కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
జైళ్ళ వారీగా విడుదల అవుతున్న ఖైదీల వివరాలు
చర్లపల్లి కేంద్ర కార్యాలయం- 61 మంది ఖైదీలు
హైదరాబాద్ కేంద్ర కారాగారం- 27
వరంగల్ కేంద్ర కారాగారం- 20
చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు – 31
మహిళల ప్రత్యేక కారాగారం- 35
సంగారెడ్డి కేంద్ర కారాగారం -1
నిజామాబాద్ కేంద్ర కారాగారం – 15
మహబూబ్‌నగర్ జిల్లా జైలు – 2
నల్గొండ జిల్లా జైలు – 4
ఆదిలాబాద్ జిల్లా జైలు – 3
కరీంనగర్ జిల్లా జైలు – 7
ఖమ్మం జిల్లా జైలు – 4
ఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు- 3
మొత్తం 213 మంది ఖైదీలు ఈ రోజు విడుదల అవుతున్నారు.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!