NTV Telugu Site icon

TG EAPCET: రేపే ఎప్‌సెట్ నోటిఫికేషన్.. ఈ నెల 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Jntu

Jntu

టీజీ ఎప్‌సెట్‌ కోసం ఎదురుచూసే విద్యార్థులకు గుడ్ న్యూస్.ఫిబ్రవరి 20వ తేదీన టీజీ ఎప్‌సెట్‌-2025 నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నట్లు జేఎన్టీయూ – హైద‌రాబాద్ ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఎస్‌సెట్‌ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది. గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసి, 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను ఇతర వివరాలను రేపు https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో పొందుపర్చనున్నట్లు తెలిపారు.

Whatsapp Image 2025 02 19 At 4.58.46 Pm