హైదరాబాదీలకు గుడ్‌న్యూస్ చెప్పింది రిలయన్స్ జియో.. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి లాంటి సిటీల్లో ట్రూ-5జీ బీటా సేవలను అందిస్తోంది జియో.. ఇక, టెక్ సిటీలుగా పేరుపొందిన హైదరాబాద్, బెంగళూరులో కూడా 5జీ సేవలను ప్రారంభించేందుకు రెడీ అయ్యింది.. దీనిపై గురువారం రోజు ప్రకటన విడుదల చేసింది.. సేవల్లో నాణ్యత కోసమే ట్రూ-5జీ సేవలను వివిధ సిటీల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది.. జియో ట్రూ-5జీ వెల్కమ్ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతం వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1 జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చు అన్నమాట..
Read Also: Astrology : నవంబర్ 11, శుక్రవారం దినఫలాలు
మొత్తంగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసి మరియు నాథ్‌ద్వారా అనే ఆరు నగరాల్లో జియో ట్రూ-5G సేవలను ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు బెంగళూరు మరియు హైదరాబాద్‌లకు విస్తరించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగం గురువారం ప్రకటించింది. నవంబర్ 10 నుండి జియో వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా, వినియోగదారులకు గరిష్టంగా 1Gbps+ వేగంతో అపరిమిత 5జీ డేటా అందించబడుతుందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. జియో ట్రూ 5జీ సేవలతో ఈ రెండు టెక్-సెంట్రిక్ సిటీలలో మానవాళికి సేవ చేసే మరియు భారతీయుల జీవన నాణ్యతను మెరుగుపరిచే కొన్ని తాజా సాంకేతికతల యొక్క నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడానికి సహాయపడుతుందని చెప్పుకొచ్చింది.. ఇది కస్టమర్-నిమగ్నమైన సంస్థ. అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని నిర్ధారించడానికి, దాని అధునాతన టూ 5జీ సేవలను దశల వారీగా విస్తరిస్తామని తెలిపింది.. ఇప్పటికే ఆరు నగరాల్లో లక్షలాది మంది వినియోగదారులు 5జీ సేవలను పొందుతున్నారు.. దీనిపై యూజర్ల నుంచి సానుకూల స్పందన ఉందట..