Site icon NTV Telugu

MLC Jeevan Reddy : రాష్ట్రంలో సర్పంచుల హక్కులను కాలరాశారు

Jeevanreddy

Jeevanreddy

మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సర్పంచుల హక్కులను కాలరాశారన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, ఎర్రబెల్లికి మంత్రి వర్గంలో కొనసాగే హక్కు లేదన్నారు జీవన్‌ రెడ్డి. కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. చెట్లు పెరగకపోతే సర్పంచులను సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను ట్రెజరీకి చూపించి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

Also Read : Delhi Mayor Polls: ఢిల్లీలో హైటెన్షన్‌.. వీధుల్లో ఆప్, బీజేపీ పోటాపోటీ నిరసనలు

గ్రామ స్వరాజ్యంతోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి జరుగుతుందన్న జీవన్‌ రెడ్డి.. కేవలం ఎన్నికల నిర్వహణ ద్వారా అభివృద్ధి జరగదన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని రాజీవ్ రోజ్ గార్ యోజన ప్రవేశపెట్టారని, ఉమ్మడి రాష్ట్రంలో తలసరి గ్రాంటు, ఇతర గ్రాంటులు నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ సర్పంచులకైనా నిధులు వెంటనే సమకూర్చాలన్నారు. ఏకగ్రీవమైనా గ్రామ పంచాయతీలకు సర్కారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఏకగ్రీవం కాకుండా ఎన్నికల్లో తాగి తందనాలు ఆడితే అబ్కారీ శాఖకు ఆదాయం వస్తుండేనని ప్రభుత్వం ఆలోచిస్తుందని విమర్శించారు జీవన్‌ రెడ్డి.

Also Read : Harassment Case: లైంగిక వేధింపుల కేసు.. సందీప్‌ సింగ్‌పై 7గంటల పాటు ప్రశ్నల వర్షం

Exit mobile version