NTV Telugu Site icon

T Jeevan Reddy: బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా?.. కేసీఆర్‌ పై జీవన్ రెడ్డి ఫైర్‌

T Mlc Jeevan Reddy

T Mlc Jeevan Reddy

T Jeevan Reddy: బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా?.. కేసీఆర్‌ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నరసింహారెడ్డిని వైదొలగమనడానికి నువ్వెవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు దొంగే పోలీస్ లను బెదిరిచ్చినట్టు ఉందన్నారు. కేసీఆర్ పై విచారణ కక్ష సాధింపు కాదన్నారు. విచారణకు సహకరించకపోవడమె కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్టే అన్నారు. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థను కేసీఆర్ కించపరుస్తున్నాడని తెలిపారు.

Read also: D. Sridhar Babu: చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్‌

విద్యుత్ ప్రాజెక్ట్ లలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త నినాదం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని దామరాచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తారా? బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా? అని ప్రశ్నించారు. కేసీఆర్కె తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకంపై 40 వేల కోట్ల భారం పడిందన్నారు. సోలార్ పవర్ తో యూనిట్ 3 రూపాయలకె విద్యుత్ లభిస్తుంది.. యాదాద్రి థర్మల్ పవర్ తో రాష్ట్ర ప్రజానీకంపై భారం పడుతుందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదన్నారు. నరసింహారెడ్డి నివేదిక తో కేసీఆర్ కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Happy Fathers Day: నాన్న మాటల్లో ప్రేమ.. కోపంలో బాధ్యత.. అణుక్షణం బిడ్డ గురించే ఆలోచన..

మరోవైపు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాసిన లేఖపై విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తామన్నారు. లేఖలో కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలను వాస్తవాలతో పోల్చి చూడాలని అన్నారు. బిహెచ్‌ఇఎల్ ప్రతినిధులను కూడా వాస్తవాలపై వివరాలు అడుగుతారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునరాలోచన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై సమీక్ష నిర్వహించనున్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Traffic Restrictions: అల‌ర్ట్‌… రేపు న‌గ‌రంలో ప‌లు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..