NTV Telugu Site icon

Sangareddy Crime: కుటుంబాన్నే చంపేదుకు స్కెచ్.. బంధువే అంటున్న బాధితులు

Sangareddy Crime

Sangareddy Crime

Current shock: సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం జీవన్ రావు పేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబాన్ని కరెంట్ షాక్ పెట్టి చంపేందుకు కొందరు గుర్తు తెలియని దుండగుల ప్రయత్నం చేయడంతో సంగారెడ్డిలో ఈఘటన కలకలం రేపింది. ఇంటి ముందు ఉన్న మీటర్ నుంచి తలుపుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి బకెట్ లో నీళ్లు పోసి ఇనుప రాడ్ తో ఎర్తింగ్‌ ఇచ్చారు దుండగులు. అది తెలియక ఉదయం లేచిన తల్లి, కూతుళ్లు తలుపు తీయగానే కరెంట్ షాక్ కి గురయ్యారు. ఇద్దరు విద్యుత్ షాక్ తో కేకలు వేస్తుండగా గమనించి స్థానికులు వారిని కాపాడారు. అయితే ఇంటి వద్దనే కాకుండా ఇంటి యజమానికి రాములు బావి వద్ద కూడా రెండు బోరు మోటర్లను దుండగుల బెట్టారు. దీంతో షాక్ కు గురైన కుటుంబం పోలీసుకుల ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read also: Minister Adimulapu Suresh: టీడీపీ కోటలు బీటలు వారుతున్నాయి..

అయితే బాధితుడు రాములు మాట్లాడుతూ.. భూమి కోసమే కుటుంబాన్ని చంపాలని చూసారని తెలిపారు. గతంలో గ్రామంలో భూమి కోసం గొడవలయ్యాయని పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని ఇలా చేసారని రాములు చెబుతున్నాడు. గతంలోను రెండు సార్లు రాములు కుటుంబాన్ని హత్య చేయడానికి పొలంలో కరెంట్ షాక్ పెట్టారని ఆరోపించాడు. తమ బంధువులపైనే అనుమానం వుందని అతడిని అదుపులో తీసుకోవాలని కోరాడు. ఇలాగే వదిలేస్తే నన్ను, నాకుటుంబాన్ని చంపేస్తారని వాపోయాడు. ఘటనపై విచారణ చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్న పోలీసులు తెలిపారు. సమీప బంధువుపై అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
AAP Corporators: సూరత్‌లో ఆప్‌కు షాక్‌.. అధికార బీజేపీలో చేరిన ఆరుగురు కార్పొరేటర్లు

Show comments