Site icon NTV Telugu

ప్రగతి భవన్‌ వద్ద జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్‌ దగ్గర హల్‌ చల్ చేశారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రగతి భవన్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు జేసీ దివాకర్‌ రెడ్డి.. అయితే, అపాయింట్‌మెంట్‌ లేకుండా సీఎంను కలిసేందుకు లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు.. కానీ, సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ కాకుంటే మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు జేసీ దివాకర్‌రెడ్డి… ఇక, పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో జేసీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టుగా తెలుస్తోంది.. మొత్తంగా ప్రగతి భవన్‌ ముందు జేసీ దివాకర్‌రెడ్డి కొద్దిసేపు హడావుడి చేశారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే జేసీ దివాకర్‌రెడ్డి.. ఆ మధ్య తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ప్రత్యక్షమై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. ఇప్పుడు ప్రగతి భవన్‌ దగ్గర పోలీసులతో వాగ్వాదానికి దిగి.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

Read Also: గోవా అసెంబ్లీ పోల్.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

Exit mobile version