Site icon NTV Telugu

Jayasudha: బీజేపీకి జయసుధ గుడ్ బై.. కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ..!

Jayasidha

Jayasidha

Jayasudha: లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే విక్రమ్ గౌడ్ రాజీనామా చేయగా.. ఇప్పుడు ప్రముఖ తెలుగు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండగా ఆయన బాటలోనే జయసుధ కూడా కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జయసుధ తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పంపారు. అయితే జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.

Read also: ED Raid in Bengal: బెంగాల్ లో మరోసారి ఈడీ రైడ్స్.. మంత్రి సుజిత్ బోస్ ఇంట్లో తనిఖీలు..

జయసుధ చాలా చిత్రాలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధినేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకు జయసుధ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జయసుధ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగగా.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసుధ గెలవలేకపోయారు. జయసుధ 2016లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే వారిలో ఎక్కువ మంది ఆ పార్టీలో యాక్టివ్‌గా లేరు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయసుధ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశించిన జయసుధకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జయసుధ సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Budget 2024 : బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్న జీతాల తరగతి.. మరి నిర్మలమ్మ నెరవేర్చేనా ?

Exit mobile version